భార్య మ‌ర్మాంగంపై క‌త్తిగాట్లు: భ‌ర్త దుర్మార్గం

దావ‌న‌గెరె: క‌ట్టుకున్న భ‌ర్తే కాల‌య‌ముడి అవ‌తారం ఎత్తాడు. త‌న త‌ల్లితో క‌లిసి భార్య గొంతు కోశాడు. ఆమె నిద్రిస్తున్న స‌మ‌యంలో మ‌ర్మాంగంపై క‌త్తిగాట్లు పెట్టాడు. ఈ ఘ‌ట‌న తీవ్రంగా గాయ‌ప‌డిన ఆ గృహిణి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని దావ‌ణ‌గెరె జిల్లా శామ‌నూరు గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలి పేరు నిర్మ‌ల‌. మూడేళ్ల కింద‌ట ఆమెకు శామ‌నూరుకు చెందిన మ‌ధు అనే యువ‌కుడితో వివాహ‌మైంది. పెళ్లి స‌మ‌యంలో త‌న‌కు ఉన్నంతలో క‌ట్న కానుక‌ల‌ను స‌మ‌ర్పించుకున్నారు నిర్మ‌ల త‌ల్లిదండ్రులు. పెళ్ల‌యిన కొద్దిరోజుల‌కే నిర్మ‌ల‌కు అత్తింటి ఆరాళ్లు మొద‌ల‌య్యాయి.

అద‌న‌పు క‌ట్నం కోసం భ‌ర్త‌, అత్త‌, ఇత‌ర కుటుంబ స‌భ్యుల నుంచి ఆమె వేధింపుల‌ను ఎదుర్కొన్నారు. వాళ్లు అడిగినంత డ‌బ్బులు తెచ్చివ్వ‌లేని ప‌రిస్థితుల్లో నిస్స‌హాయురాలిగా మారిన నిర్మ‌ల‌ను మ‌ధు, అత‌ని త‌ల్లి నీల‌మ్మ ఆదివారం సాయంత్రం దాడి చేశారు.

ఆమె నిద్రిస్తుండ‌గా బాకు తీసుకుని గొంతు కోసే ప్ర‌య‌త్నం చేశారు. మ‌ర్మాంగంపై క‌త్తిగాట్లు పెట్టారు. ఈ దాడిలో గాయ‌ప‌డ్డ నిర్మ‌ల దావ‌న‌గెరె ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. నిర్మ‌ల త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు దావ‌న‌గెరె మ‌హిళా పోలీస్‌స్టేష‌న్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here