75 ఏళ్ల వ‌య‌స్సులో..భార్య చేతిలో!

ముంబై: కాటికి కాళ్లు చాపుకొన్న వ‌య‌స్సులో క‌ట్టుకున్న భార్య చేతిలో దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యాడో వ‌యోధిక వృద్ధ‌డు. అత‌ని పేరు ఛోటేలాల్ మౌర్య‌. వ‌య‌స్సు 75 సంవ‌త్స‌రాలు. 65 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న భార్య చేతిలో దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారాయ‌న‌.

చిన్న‌ చిన్న విష‌యాల‌ను భూత‌ద్దంలో చూస్తూ, గొడ‌వ ప‌డుతుండ‌టంతో విసిగి, వేసారిన ఆయ‌న భార్య కొట్టి చంపారు. దీనికోసం ఆమె పార్కింగ్ టైల్స్‌ను వినియోగించారు. ఎవ‌రికీ అనుమానం రాకూడ‌ద‌నే ఉద్దేశంతో రాత్రంతా ఆమె భ‌ర్త మృత‌దేహం ప‌క్క‌నే నిద్రించారు. ముంబైలోని చెంబూర్ మురికివాడ‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

 

ఛోటేలాల్ మౌర్య‌కు 40 ఏళ్ల కింద‌ట ధ‌న్నూదేవితో వివాహ‌మైంది. చెంబూర్ మురికివాడ‌ల్లోని వీకే కృష్ణ‌మీన‌న్ న‌గ‌ర్‌లో ఆయ‌న నివ‌సిస్తున్నారు. మౌర్య దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు. గ‌తంలో ఆయ‌న వాచ్‌మెన్‌గా ప‌నిచేస్తుండేవారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో ఆయ‌న‌కు వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది.

ఇన్నేళ్ల‌యిన‌ప్ప‌టికీ.. ఆయ‌న వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగిస్తున్నాడ‌ని భార్య ధ‌న్నూదేవి అనుమానిస్తుండేది. దీనితోపాటు- చిన్న‌, చిన్న విష‌యాల‌కు త‌న‌ను కొడుతుండ‌టంతో విసిగిపోయిన ధ‌న్నూదేవి శ‌నివారం రాత్రి ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో పార్కింగ్ టైల్స్‌తో కొట్టి చంపింది. అదే స‌మ‌యంలో విధులు ముగించుకుని కుమారులు ఇంటికొచ్చారు.

వారికి అనుమానం రాకుండా ప్ర‌వ‌ర్తించింది. రాత్రంతా భ‌ర్త మృత‌దేహం ప‌క్క‌నే ప‌డుకుంది. తెల్ల‌వారిన త‌రువాత మొద‌ట వారి కుమారుడు రామ్‌జీ ఈ విష‌యాన్ని గుర్తించారు. ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉన్న ఛోటేలాల్‌ను వారు రాజావాడి ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అప్ప‌టికే ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. దీనిపై పోలీసుల‌కు స‌మాచారం అందింది. ధ‌న్నూదేవి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. త‌ల‌పై పార్కింగ్ టైల్స్ ప‌డ‌టంతో గాయ‌ప‌డిన‌ట్టు ఆమె పోలీసుల‌కు వెల్ల‌డించారు. పోస్ట్‌మార్ట‌మ్ నివేదిక‌లో అస‌లు విష‌యం తేలింది.

టైల్స్‌తో బ‌లంగా మోద‌డం వ‌ల్లే ఛోటేలాల్ పుర్రెలో ప‌గుళ్లు ఏర్ప‌డ్డాయ‌ని, ఆ కార‌ణంతోనే అత‌ను మ‌ర‌ణించిన‌ట్లు పోస్ట్‌మార్ట‌మ్ నివేదిక వెల్ల‌డించింది. దీనితో పోలీసులు ధ‌న్నూదేవిని అదుపులోకి తీసుక‌ని విచారించ‌గా.. ఆమె త‌న నేరాన్ని అంగీక‌రించారు. దీనితో ఆమె హ‌త్య‌కేసు న‌మోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here