అంత పెద్ద పామును చులాగ్గా ప‌ట్టేశారు..!

పిల్ల పాములు క‌నిపిస్తేనే భ‌యంతో వ‌ణికిపోతాం. కాళ్లూ, చేతులు ఆడ‌వు. కొంద‌రు స్థానికులు, అట‌వీశాఖ సిబ్బంది మాత్రం అంత పెద్ద పామును సులువుగా ప‌ట్టేశారు. క‌ద‌ల్లేని స్థితిలో ఉన్న ఆ ప‌ది అడుగుల పామును సుర‌క్షిత ప్రాంతంలో వ‌దిలిపెట్టారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చిక్‌మ‌గ‌ళూరు జిల్లా కొప్ప తాలూకాలోని మ‌హ‌ల్‌గూడు గ్రామంలో చోటు చేసుకుంది.

మ‌హ‌ల్‌గూడు గ్రామ శివార్ల‌లో ఓ చెరువు వ‌ద్ద క‌ద‌ల్లేని స్థితిలో క‌నిపించింది. దీన్ని గ‌మ‌నించిన స్థానికులు పాముల సంర‌క్ష‌కుడు హ‌రీంద్ర‌, అట‌వీశాఖ సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే- చెరువు వ‌ద్ద‌కు చేరుకున్న హ‌రీంద్ర చాక‌చ‌క్యంగా దాన్ని ప‌ట్టుకున్నారు.

చెరువులో కప్ప‌లు, చేప‌ల‌ను అమితంగా తిన‌డం వ‌ల్ల క‌ద‌ల్లేని స్థితికి చేరుకుంద‌ని గుర్తించారు. కొద్దిసేప‌టి త‌రువాత దాన్ని అడ‌వుల్లో వ‌దిలి పెట్టారు. కొద్దిరోజులుగా చిక్‌మ‌గ‌ళూరు, కొడ‌గు ప్రాంతాల్లో భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీనితో చెరువులో తొణికిస‌లాడుతున్నాయి. దీనితో- అందులో చేరిన క‌ప్ప‌లు.. ఇత‌ర జ‌ల‌చ‌రాల‌ను మింగ‌డానికి పాములు వ‌స్తున్నాయ‌ని హ‌రీంద్ర చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here