త‌మిళ మ‌హాల‌క్ష్మిగా మ‌న ప్రీతి

ప్రీతి గుర్తుందిగా. ఎక్క‌డో క‌నెక్ట్ అవుతోంది క‌దా. ఆ… ఆమె… అర్జున్ రెడ్డిలో ప్రీతి పాత్ర పోషించిన షాలిని పాండే. ఇక మ‌హాలక్ష్మి ఏంటి అంటారా? నాగ చైతన్య హీరోగా, త‌మన్నా హీరోయిన్ గా, సుకుమార్ రూపొందించిన రొమాంటిక్ ఎంట‌ర్టెయినర్ సినిమా 100% లవ్ చిత్రం.  2011లో విడుదలై సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. సుకుమార్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా మలిచారు. చైతు, తమన్నా ఈ చిత్రంలో జంటగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సంచలనమే. హండ్రెడ్ ప‌ర్సెంట్ ల‌వ్ చిత్రంలో త‌మ‌న్నా పాత్ర పేరు మ‌హాల‌క్ష్మి. ద‌టీస్ మ‌హాల‌క్ష్మి పాట కూడా సినిమాలో హైలైట్ గా నిలిచింది.

100% కాదల్ పేరుతో తమిళంలో రీమేక్ 
తెలుగు సూపర్ హిట్ చిత్రాలు పరభాషల్లో రీమేక్ కావడం సహజమే. 100% లవ్ చిత్రాన్ని దర్శకుడు ఎంఎం చంద్రమౌళి తెరక్కిస్తున్నాడు.  ఈ చిత్రాన్ని 100% కాదల్ పేరుతో తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే, తమిళ నటుడు జివి ప్రకాష్ కుమార్ జంటగా నటిస్తున్నారు. 100 పెర్సెంట్ లవ్ చిత్రంలో తమన్నా నటన హైలైట్ గా నిలిచింది. తమిళంలో షాలిని పాండే ఎలా నటిస్తుందో చూడాలి.

టీజ‌ర్ కు భారీ స్పంద‌న‌
తాజాగా 100% కాదల్ టీజర్ ని విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే కథలో ఎలాంటి మార్పులు లేకుండా ఒరిజినల్ స్టోరీని ఫాలో అయిపోయినట్లు తెలుస్తోంది. షాలిని పాండే క్యూట్ లుక్స్ తో అదరగొడుతోంది. 100 పెర్సెంట్ లవ్ చిత్రంలో తమన్నాకు నాగ చైతన్య ఇంఫ్యాక్చుయేషన్ అంటే ఏంటో వివరించే సన్నివేశం చాలా సరదాగా ఉంటుంది. ఆ సన్నివేశాన్నే తమిళ ప్రోమోగా విడుదుల చేశారు. జివి ప్రకాష్.. షాలిని ఇంఫ్యాక్చుయేషన్ అంటే ఏంటో వివరిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here