త‌న‌కు ఎంత‌మంది మునిమ‌న‌వ‌ళ్లున్నారో ఆ వందేళ్ల అవ్వ‌కు తెలియ‌ద‌ట‌!

ధార్వాడ‌: ఈ రోజుల్లో 70-80 ఏళ్లు బ‌త‌క‌డ‌మే గొప్ప‌. కాస్త ఆరోగ్య‌క‌రమైన ఆహారాన్ని భుజిస్తూ, ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో జీవించే వాళ్లు సెంచ‌రీ దాటి పోయారు. ఈ అవ్వ కూడా ఆ జాబితాలోకే చేరుతారు. ఈ అవ్వ‌కు వందేళ్లు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఆమె కుమారులు, కుమార్తెలు పుట్టినరోజు వేడుక‌ను నిర్వ‌హించారు.

ఆమె అయిదుగురు పిల్ల‌లతో పాటు మ‌న‌వ‌ళ్లు, మునిమ‌న‌వ‌ళ్లు హాజ‌ర‌య్యారు. ఆ అవ్వ పిల్ల‌ల‌ను ప‌క్క‌న‌పెడితే.. ఆమె మ‌న‌వ‌ళ్లు, మునిమ‌న‌వ‌ళ్ల సంఖ్య 60. ఇంత‌మంది ఒకే చోటికి చేరి సంద‌డి చేశారు. విశేష‌మేమిటంటే..త‌న‌కు ఇంత‌మంది వార‌సులు ఉన్నార‌నే విష‌యం ఆ అవ్వ‌కు తెలియ‌దు.

అంతేకాదు- ఈ మన‌వ‌ళ్లు, మునిమ‌న‌వ‌ళ్ల‌లో కూడా చాలామందికి తాము బంధువుల‌మ‌నే విష‌య‌మే తెలియ‌ద‌ట‌. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని ధార్వాడలో చోటు చేసుకుంది. ఆ వందేళ్ల అవ్వ పేరు య‌మున‌మ్మ. ధార్వాడ‌లోని ఓ ఫంక్ష‌న్ హాలులో ఈ కార్య‌క్ర‌మాన్ని వైభ‌వంగా నిర్వ‌హించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here