11 ఏళ్ల అమ్మాయిని.. 60 ఏళ్ళు పైబడిన ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు.. ఇప్పుడు 8నెలల గర్భవతి..!

వయసుకు మనవరాలు అయ్యే అమ్మాయిని ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. ఇప్పుడు ఆమె 8 నెలల గర్భవతి.. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో కడుపులో బిడ్డను మోస్తోంది. అలాంటి కామాంధులకు ఎటువంటి శిక్షను విధించినా పాపం లేదు..!

ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్ కోట్ చోటుచేసుకుంది. నాన్జీ జావియా అనే 67 సంవత్సరాల వ్యక్తి.. అరవింద్ కుబావత్ అనే 60సంవత్సరాల వ్యక్తి కలిసి 11 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశారు. ఆ విషయం చాలా రోజులకు గానీ బయటకు రాలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి 8 నెలల గర్భవతి. ఆ అమ్మాయిపై అత్యాచారం చేసే ముందు డబ్బులు కూడా ఇవ్వాలని చూశారు ఆ ఇద్దరు వ్యక్తులు. పేద కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి తల్లి తన కూతురు కడుపు ఉబ్బడం చూసి ఆరా తీయగా విషయం బయటపడింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఆ బాలిక తల్లి పనిమనిషిగా చాలా ఇళ్ళలో పనిచేస్తూ ఉంటుంది. తండ్రి మంచానికే పరిమతమయ్యాడు. ఆ కామాంధులకు పరిచయం అయిన ఆ బాలికకు మొదట డబ్బులు ఆశ చూపి లోబరుచుకున్నారు. చాలా రోజుల పాటూ విషయం బయటకు పొక్కలేదు. ఎప్పుడైతే గర్భవతి అని తేలిందో పోలీసుల దాకా విషయం వెళ్ళింది. ప్రస్తుతం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here