స్టీవ్ స్మిత్, వార్నర్ లకు సరైన శిక్ష.. ఒక్క ఏడాది బ్యాన్ తో ఎన్ని కోట్లు నష్టపోతున్నారంటే..!

స్టీవ్ స్మిత్, వార్నర్ లను ఒక ఏడాది పాటూ బ్యాన్ చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా తీర్పు నిచ్చింది. ఏడాది పాటు నిషేధం అంటే స్మిత్, వార్నర్ లు భారీగా నష్టపోబోతున్నారు. అటు ఆట పరంగా మాత్రమే కాకుండా డబ్బుల పరంగా కూడా ఇద్దరికీ చాలా నష్టమే..!

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ పై సీఏ ఏడాది నిషేధం విధించడంతో స్మిత్ సుమారు 20 కోట్ల రూపాయలు పైనే నష్టపోనున్నాడని తెలుస్తోంది. సీఏ నుంచి మ్యాచ్‌ ఫీజుల రూపంలో మొత్తం సుమారు 19.71 కోట్ల రూపాయలను స్మిత్ వేతనంగా అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఏడాది నిషేధం అతనిపై అమలైతే.. 13 టెస్టులు, 24 వన్డేలు, 5 టీ20లకు దూరం కానున్నాడు. ఒక్కో టెస్టుకు 14,000 డాలర్లు, ఒక్కో వన్డేకు 7,000 డాలర్లు, ఒక్కో టీ20కి 5,000 డాలర్ల వేతనాన్ని స్మిత్ సీఏ నుంచి అందుకునేవాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ అందించనున్న 12 కోట్ల రూపాయలతో పాటు, శామ్‌ సంగ్‌, న్యూ బాలెన్స్‌ తదితర ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా పొందే రెమ్యూనరేషన్ ను కోల్పోనున్నాడు.

వైస్ కెప్టెన్ గా వార్నర్ ఏడాదిలో 13 టెస్టులు, 24 వన్డేలు, 5 టీ20లకు దూరం కానున్నాడు. దీంతో మ్యాచ్‌ ఫీజుల రూపంలో సీఏ నుంచి దక్కాల్సిన 19.6 కోట్ల రూపాయలను కోల్పోతాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాదు ఫ్రాంఛైజీ ఇవ్వాల్సిన 12.5 కోట్ల రూపాయలను కోల్పోనున్నాడు. బ్రాండ్ కంపెనీలు ఆసీక్స్‌, ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌, ఛానెల్‌ 9, గ్రే నికోలస్‌, మిలో, మేక్‌ మై విష్‌ సంస్థలు అందించే పారితోషికాన్ని కూడా కోల్పోనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here