ఇసుజు గ్రాండ్ అడ్వెంచ‌ర్ 4×4 కారు ఇంజిన్‌లో 12 అడుగుల కొండచిలువ!

ఇసుజు గ్రాండ్ అడ్వెంచ‌ర్ 4×4 కారు కారు అది. ఎప్ప‌ట్లానే రాత్రి త‌న ఇంటి బ‌య‌ట పార్క్ చేశాడు. మ‌రుస‌టి రోజు పొద్దున్నే షాప్‌కు వెళ్ల‌డానికి కారును రెడీ చేశాడు. సాధార‌ణంగా- కారు ఇంజిన్‌ను చెక్ చేయ‌డు గానీ.. ఎందుకో అనుమానం వచ్చింది. స్టార్ట్ చేయ‌డానికి ముందే కారు ఇంజిన్‌లో ఏదో తేడా క‌నిపెట్టాడు.

ఎందుకైనా మంచిద‌నే ఉద్దేశంతో బోనెట్ ఎత్తి చూసే స‌రికి అత‌ని పైప్రాణాలు పైనే పోయినంత ప‌నైంది. కార‌ణం- సుమారు 12 అడుగుల కొండ చిలువ ఇంజిన్‌లో క‌నిపించింది. బోనెట్ ఎత్త‌డం వ‌ల్ల ఎండ వేడి త‌గిలిందో, ఏమో చివ్వుమ‌ని త‌లెత్తి చూసింద‌త‌ని వైపు. దాన్ని చూడ‌గానే అమాంతం ఆమ‌డ‌దూరం ల‌గ్గెత్తాడు.

వెంటనే- పాముల సంర‌క్ష‌కుల‌కు స‌మాచారం ఇచ్చాడు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అత‌ని ఇంటి వ‌ద్ద‌కు చేరుకున్న సంర‌క్షులు, ఒడుపుగా ఆ కొండ చిలువ‌ను బ‌య‌టికి లాగారు. దాన్ని ప‌ట్టుకుని ద‌గ్గ‌ర్లోనే ఉన్న అట‌వీ ప్రాంతంలో వ‌దిలేశారు.

థాయ్‌లాండ్ రాజ‌ధాని బ్యాంకాక్ శివార్ల‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది. ఆ కారు ఆసామి పేరు తీ న‌ట్విజిట్‌. వ‌య‌స్సు 57 సంవ‌త్స‌రాలు. వాతావర‌ణం బాగా చ‌ల్ల‌బ‌డ్డ‌ప్పుడు పాములు, కొండ‌చిలువ‌లు వెచ్చ‌టి ప్ర‌దేశాల కోసం వెదుక్కోవ‌డం స‌హ‌జ‌మేన‌ని పాముల సంర‌క్ష‌కుడు క్రిట్ప‌ల్ పూల్‌సొంగ్ తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here