ఈ అమ్మాయి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి ఒకే ఒక్క కారణం..!

కొందరు విద్యార్థులను బలంగా నమ్మిస్తూ ఉంటారు. అదేమిటంటే మార్కులే జీవితం అని.. అవే శాశ్వతం అని..! ఇప్పుడు కానీ నువ్వు ఫెయిల్ అయ్యవంటే నీ జీవితమే ఫెయిల్ అని చెబుతూ ఉంటారు. అలాంటి మాటలను నమ్మిన ఈ అమ్మాయి చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. మార్కులు అనుకున్నంత రాలేదని.. ఇంట్లో వాళ్ళ పరువు తీశానని భావించిన ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆమె చెప్పిన కారణం కూడా ఒకటే.. ‘నాకు అనుకున్న మార్కులు రావు.. కాబట్టి నేను చనిపోతున్నా.. నన్ను క్షమించండి’ అని..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని కాన్పూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. గోవిందనగర్ లో ఉండే హరికృష్ణ శుక్లా ఎస్ఐ గా పనిచేస్తూ ఉన్నాడు. అతడికి 12 వ తరగతి చదువుతున్న ప్రజ్ఞ అనే కూతురు ఉంది. ప్రజ్ఞా నాన్నమ్మ కు ఆసుపత్రిలో చేర్పించడంతో అందరూ ఆమెను చూడడానికి వెళ్ళారు. ప్రజ్ఞా తమ్ముడు శోభిత్ స్కూల్ కు వెళ్ళాడు. శోభిత్ స్కూల్ నుండి వచ్చాడు. ఆ సమయంలో తలుపులు మూసేశారు. అయితే తలుపు సందులోకి తొంగిచూసిన శోభిత్ షాక్ తిన్నాడు. ఎందుకంటే అతడి అక్క ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

వెంటనే శోభిత్ చుట్టు ఉన్నవాళ్ళకు విషయం చెప్పడమే కాకుండా.. తన తల్లికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు వాషింగ్ మెషీన్ లో సూసైడ్ నోట్ ఉండడాన్ని గమనించారు. మంచి మార్కులు తనకు రావనే భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here