వధువు వయసు 23.. వరుడి వయసు 13.. చిన్నారి పెళ్ళి కొడుకు..!

వధువు వయసు 23.. వరుడి వయసు 13.. ఈ పెళ్ళి గురించి తెలుసుకోవాలంటే మనం కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాలి. కర్నూలు జిల్లా లోని కౌతాలం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పెళ్ళి జరిగిన కొన్ని రోజులకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విషయం బయటకు వచ్చింది.

13 సంవత్సరాల ఆ యువకుడికి 23 సంవత్సరాల కేరళ అమ్మాయిని ఇచ్చి ఆ యువకుడి తల్లి పెళ్ళి చేసిందట. వీరిద్దరూ బంధువులు కావడంతో పెద్దలు పెళ్లి కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి బంధువులు కూడా భారీగా తరలివచ్చారట. కుటంబ సమస్యల వల్లే బాలుడికి త్వరగా వివాహం చేశారట. విషయం ఆ నోటా ఈ నోటా అధికారుల దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆ ఊరికి వెళ్లి ఆరా తీయగా… జంట అక్కడ లేదట. మైనర్ బాలుడికి పెళ్లి చేయడం నేరం కావడంతో వీరిని గుర్తించే పనిలో ఉన్నారు. తాను చనిపోతే కుమారుడు ఏమైపోతాడోనని ఆ మహిళ తన కొడుకుకు పెళ్ళి చేసేశానని ఆమే చెప్పడంతో అధికారులు షాక్ తిన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here