మ‌రో గ్యాంగ్‌రేప్‌: ఈ సారీ 13 ఏళ్ల బాలిక‌పైనే

ల‌క్నో: ఆడ‌పిల్ల‌ల‌కు ఏ మాత్రం ర‌క్ష‌ణ లేకుండా పోయిందన‌డానికి తాజా ఉదాహ‌ర‌ణ ఈ ఘ‌ట‌న. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోనే ఈ దారుణం కూడా చోటు చేసుకుంది. 13 సంవ‌త్స‌రాల బాలిక‌ను కారులో కిడ్నాప్ చేసిన ముగ్గురు యువ‌కులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ప్ఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లా షామ్లిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స‌చిన్‌, బ‌న్షీ, అన్ను అనే ముగ్గురు యువ‌కులు అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లుగా గుర్తించారు. వారిలో స‌చిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ఇద్ద‌రి కోసం గాలిస్తున్న‌ట్టు ష‌మ్లీ పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here