వాట్సప్ ఫార్వర్డ్ మెసేజ్ లు నమ్మడం.. ఇలా బ్యాటులు తీసుకొని కొట్టి చంపేయడం..!

వాట్సప్ లో వచ్చే ఫార్వర్డ్ మెసేజీలు ఎంత ప్రమాదకరంగా మారుతాయో ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు. వివిధ రాష్ట్రాలలో ఇప్పటికే ఎంతో మందిని అనుమానంతో కొట్టి చంపేశారు. ఆ ఫార్వర్డ్ మెసేజీల్లో పిల్లలను పట్టుకోడానికి కొన్ని బ్యాచ్ లు వచ్చాయని రావడంతో దాన్ని గుడ్డిగా నమ్మిన వాళ్ళు అనుమానితులను, భాష రానివాళ్ళను కొట్టి చంపేస్తున్నారు.

ఇలాంటి ఘటనే బెంగళూరు శివార్లలో చోటుచేసుకుంది. ఫార్వర్డ్ మెసేజీలను నమ్మిన కొందరు ఓ రాజస్థాన్ వ్యక్తిని పట్టుకున్నారు. అతన్ని క్రికెట్ బ్యాట్ లతో ఇష్టం వచ్చినట్లు కొట్టి చంపేసారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ వ్యక్తి మృతికి కారణమైన 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన పోలీసులు ఆ వీడియోలో ఉన్న వారిని అరెస్ట్ చేశారు. ఎంతో క్రూరంగా ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్లతో అతడిని కొట్టి చంపేశారు. బెంగళూరులోని చామరాజ పేట ప్రాంతంలో ఉన్న రంగనాథ టాకీస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల రాజస్థాన్ వ్యక్తి కాళ్ళూ చేతులు కట్టేసి ఇష్టం వచ్చిన వస్తువును తీసుకొని కొట్టి చంపేశారు.

ఈ ఘటనపై పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది షేర్ చేస్తుంటారని వాటిని నమ్మేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఎవరైతే ఇలాంటి ఫేక్ మెసేజీలను ఫార్వర్డ్ చేస్తారో వాళ్లకు కూడా శిక్ష విధిస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here