సంక్రాంతికి అమ్మ‌మ్మ ఇంటికెళ్లి..ఏనుగు దాడికి బ‌లి: మ‌న‌వ‌డి మృత‌దేహాన్ని చూసి మూర్ఛిల్లిన అమ్మ‌మ్మ‌

అమ్మ‌మ్మ వాళ్ల ఊరిలో సంక్రాంతి పండుగ సెల‌వుల‌ను స‌ర‌దాగా గ‌డిప‌డానికి వెళ్లిన ఓ బాలుడు ఏనుగు దాడికి బ‌ల‌య్యాడు. త‌న మ‌న‌వ‌డి మృత‌దేహాన్ని చూసిన ఆ అమ్మ‌మ్మ స్పృహ త‌ప్పింది.

ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హాస‌న్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడి పేరు భ‌ర‌త్‌. 14 సంవ‌త్స‌రాల భ‌ర‌త్ మండ‌ల కేంద్రం ఆలూర్‌లో ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుకుంటున్నాడు.

సంక్రాంతి సెల‌వులు రావ‌డంతో అమ్మ‌మ్మ వాళ్ల ఊరు కొడ‌గ‌ట్ట‌వ‌ళ్లికి వెళ్లాడు. ఆ గ్రామం అట‌వీ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది. శ‌నివారం భ‌ర‌త్ ఇంటికి కాస్త దూరంలో స్నేహితుల‌తో క‌లిసి ఆడుకుంటుండ‌గా.. హ‌ఠాత్తుగా స‌మీప అడ‌వుల నుంచి వ‌చ్చాయి రెండు ఏనుగులు.

వాటిని చూసి పిల్ల‌లు పారిపోయారు. దీనితో అవి వారిని వెంబ‌డించాయి. భ‌ర‌త్‌.. ఓ ఏనుగుకు చిక్కాడు. ఏనుగు భ‌ర‌త్‌ను తొక్కి చంపింది.

స‌మాచారం అందుకున్న అమ్మ‌మ్మ సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మ‌న‌వ‌డి మృత‌దేహాన్ని చూస్తూ కుప్పకూలిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై ఆలూర్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here