చూయింగ్ గమ్ నములుతూ.. నములుతూ నిద్రపోయింది.. ఇక అంతే..!

చూయింగ్ గమ్.. పిల్లలు అప్పుడప్పుడు తినాలని అనుకుంటూ ఉంటారు. అయితే వీటి వలన కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. అందుకే దాన్ని నమిలేశాక ఉమ్మేసారా లేదా అన్నది తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. లేదంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఓ అమ్మాయి చూయింగ్ గమ్ నములుతో నములుతూ నిద్రపోవడం ఆ అమ్మాయి ప్రాణాలు తీసింది.

హావేరీ జిల్లాలోని గుత్తల గ్రామంలోని గౌరమ్మ అనే 14సంవత్సరాల అమ్మాయి ప్రాణాలు చూయింగ్ గమ్ కారణంగా పోయాయి. గౌరమ్మ రాత్రి సమయంలో అన్నం తిన్న తర్వాత ఇంటి దగ్గర ఉన్న అంగడికి వెళ్ళి ఓ చూయింగ్ గమ్ కొనుక్కుంది. ఆ చూయింగ్ గమ్ ను నమలడం మొదలుపెట్టింది. నమలడం మొదలుపెట్టిన ఆ అమ్మాయి అలాగే నిద్రపోయింది. అయితే ఆమె ఆ చూయింగ్ గమ్ ను నిద్రలో మింగేసింది.

కొద్దిసేపటి తర్వాత ఆమె దగ్గుతూ.. దగ్గుతూ రక్తం కూడా కక్కేసింది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. అక్కడికి తీసుకొని వెళ్ళగా అమ్మాయి అప్పటికే కోమా లోకి వెళ్ళింది. జిల్లా ఆసుపత్రికి తీసుకొని వెళుతుండగా మార్గమధ్యమంలో మరణించింది. చూయింగ్ గమ్ గొంతులో ఇరుక్కుపోవడం వలనే తమ అమ్మాయి చనిపోయిందని తల్లిదండ్రులు అంటున్నారు.

Image result for chewing gum kills

ఈ విషయం పై అవగాహన కల్పించేందుకు.. వీలైనంతమందికి షేర్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here