పుట్టినరోజు నాడే..15 ఏళ్ళ బాలికపై 14 మంది అత్యాచారం.. విషయం తెలిసి ఊరి పెద్దలు ఏమి చేశారంటే..!

తెలంగాణ రాష్ట్రంలో సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై రెండు రోజుల పాటూ 14మంది యువకులు అత్యాచారం చేశారు. అడవుల్లోకి తీసుకొని వెళ్ళి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు ఆ యువకులు. విషయం తెలుసుకున్న పెద్ద మనుషులు.. పోలీసులకు సమాచారం అందించకుండా.. రాజీ చేయాలని ప్రయత్నించారట.. మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి.. అంత ఇప్పిస్తాం అని బాలిక తరపున వాళ్లకు బేరాలు పెట్టారట.. ఇంకో దారుణం ఏమిటంటే ఇదంతా ఆమె పుట్టినరోజు నాడే చోటుచేసుకుంది.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం జానంపేట పాండురంగాపురం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలిని అడవుల్లోకి తీసుకెళ్ళి రెండు రోజుల పాటు యువతిని 14మంది యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు నిందితులు. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక పుట్టిన రోజున సందర్భంగా స్నేహితులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచేందుకు ఆ బాలిక షాపు వద్దకు వెళ్ళింది. నిందితులు బాలికను కిడ్నాప్ చేసి అమరవరం ప్రాంతం లోని అడవుల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగినట్లు కూడా తెలిసింది. కానీ వాటికి ఆ బాలిక తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఎదుళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here