స్కూల్ లో నుండి తీసేశారన్న కారణంతో 17 మందిని చంపేశాడు.. గన్ కల్చర్ అంటే ఇదే..!

అమెరికాలో బట్టలు కొనుక్కున్నంత ఈజీగా తుపాకీ దొరుకుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ గన్ కల్చర్ కారణంగా ఇప్పటికే చాలా సార్లు.. చాలా మంది బలయ్యారు. ఈ సారి ఏకంగా 17మంది విద్యార్థులు బలయ్యారు. ఫ్లోరిడాలోని పార్క్ ల్యాండ్‌‌లోని స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నికోలస్ క్రజ్ అనే 19 ఏళ్ల విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడాన్ని జీర్ణించుకోలేని నికోలస్ తుపాకితో స్కూల్‌ కు చేరుకుని విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపే 17 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో విద్యార్థులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎదురు కాల్పులు ప్రారంభించి క్రజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ 2018 లోనే ఇది 18వ స్కూల్ షూటింగ్ అట.. ఎప్పుడు ఏ సైకో విరుచుకుపడతాడోనని పిల్లల తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. వారానికి ఒక మాస్ షూటింగ్ జరుగుతుండడంతో పిల్లలకు స్కూల్ లో రక్షణ ఉందో.. లేదో తెలియని పరిస్థితి.

తనను స్కూల్ లో నుండి తీసి పడేశారన్న కారణంతోనే నికోలస్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. నికోలస్ గతంలో కూడా ఒంటరిగా స్కూల్ లో ఉండే వాడని. అతడిని కాస్త వింత కుర్రాడని తాము అనుకునేవాళ్ళమని షూటింగ్ లో తప్పించుకున్న విద్యార్థి ఒకరు తెలిపారు. 12 మంది పిల్లలు స్కూల్ లో మరణించగా.. ఇద్దరు స్కూల్ బయట చనిపోగా.. ఒకరు వీధి చివర చనిపోయారు.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని పోలీసులు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here