తోటి క్లాస్‌మేట్స్ లిఫ్ట్ ఇస్తామంటే కారులో ఎక్కిన విద్యార్థిని..

ల‌క్నో: అమానుష సంఘ‌ట‌న‌ల‌కు ఆల‌వాల‌మైన ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో అలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి చోటు చేసుకుంది. న‌డుచుకుంటూ ఇంటికెళ్తోన్న ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థినిని కారులో ఎక్కించుకుని అత్మాచారానికి పాల్ప‌డ్డారు ఆమె తోటి క్లాస్‌మేట్స్‌. గ్రేట‌ర్ నోయిడా ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డి వారంద‌రూ బాధిత విద్యార్థినికి ప‌రిచయం ఉన్న‌వారే.

ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డి వారిలో ఆ బాలికపై సమీప బంధువు, తోటి క్లాస్‌మేట్స్ ఉన్నారు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడాకి చెందిన 16 ఏళ్ల బాలిక 11వ తరగతి చదువుతోంది. ఈ నెల 18న స్కూల్‌కి వెళ్లిన బాలిక స్కూల్ బ‌స్ మిస్ కావ‌డంతో కాలిన‌డ‌క‌న ఇంటికి బ‌య‌లుదేరింది.

అదే దారిలో కారులో వస్తున్న ముగ్గురు యువ‌కులు ఆమెను ప‌ల‌కరించారు. వారిలో ఒక‌రు త‌న స‌మీప బంధువు కాగా.. మ‌రో ఇద్ద‌రు క్లాస్‌మేట్స్‌. తెలిసిన వారే కావ‌డంతో ఆమె కారు ఎక్కి కూర్చున్నారు. అనంత‌రం ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చారు.

దాన్ని తాగిన బాలిక అపస్మార‌క స్థితిలోకి వెళ్ల‌గా.. నోట్లో గుడ్డలు కుక్కి.. కదులుతున్న కారులోనే ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం గల్గోటియా కళాశాల సమీపంలో వదిలి వెళ్లారు. తమ కూతురు ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారం‍భించిన పోలీసుల‌కు మంగళవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో కాలేజీ వద్ద అపస్మారక స్థితిలో క‌నిపించారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధిత విద్యార్థిని చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. గౌత‌మ‌బుద్ధ న‌గ‌ర పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here