సౌదీ అరేబియా లోని మదీనాలో భూకంపం..!

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరాల్లో మదీనా నగరం కూడా ఒకటి. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మదీనా నగరంలో భూకంపం వచ్చింది. సౌదీ అరేబియా లోని మదీనా నగరంలో మంగళవారం నాడు భూకంపం సంభవించింది. వాయువ్య మదీనా నగరంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్థి నష్టం కానీ జరగలేదు.

పర్యావరణాధికారి తారిక్ అబా అల్ ఖైల్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. భూకంపం చాలా స్వల్పంగా వచ్చిందని.. అది కూడా కొద్ది సెకెండ్ల పాటు మాత్రమే వచ్చిందని చెప్పారు. అలాగే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. సౌదీ మీడియా కూడా ఈ ఘటనతో ఎటువంటి నష్టం జరగలేదని చెప్పుకొచ్చింది.

వాతావరణ శాఖ అధికారుల కథనం ప్రకారం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 2.5 గా నమోదయ్యింది. మదీనాకు 14 కిలోమీటర్ల వాయువ్య ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2:59న సంభవించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here