సినిమా సెట్టింగ్ కాదు: ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్: డివైడ‌ర్‌ను ఢీ కొట్టి..ఇలా!

అతి వేగానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఉండ‌దేమో అనిపించేంతటి ఘ‌ట‌న ఇది. డివైడ‌ర్‌ను ఢీ కొట్టిన ఓ కారు కనీసం 20 అడుగుల ఎత్తు గాల్లోకి లేచింది.

ఎదురుగా ఉన్న రెండంత‌స్తుల ఇంటిని ఢీ కొట్టింది. ఢీ కొట్టి కింద ప‌డిందా? అంటే అదీ లేదు. గోడ‌ను ఢీ కొట్టి.. ఆ ఇంటి లోనికి దూసుకెళ్లింది. అక్క‌డే ఇరుక్కుపోయింది.

దీన్ని తీయ‌డానికి పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఆరు గంట‌ల పాటు శ్ర‌మించాల్సి వ‌చ్చింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది.

ఈ ప్ర‌మాద స‌మ‌యంలో కారులో డ్రైవ‌ర్ స‌హా మ‌రో వ్య‌క్తి ఉన్నారు. వారిద్ద‌రూ గాయప‌డ్డారు. కాలిఫోర్నియాలోని శాంటాఅనా ప్రాంతంలో ఆదివారం తెల్ల‌వారు జామున 4:30 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

త‌మ‌కు 5:30 గంట‌ల‌కు స‌మాచారం అందింద‌ని ఆరెంజ‌ట్ కంట్రీ ఫైర్ అథారిటీ అధికారి కేప్టెన్ స్టీఫెన్ హార్న‌ర్ తెలిపారు.

అతివేగంతో ప్ర‌యాణించిన కారు డివైడ‌ర్‌ను ఢీ కొట్టింద‌ని, దీనితో క‌నీసం 20 అడుగుల ఎత్తు వ‌ర‌కు గాల్లోకి ఎగిరి ఉంటుంద‌ని చెప్పారు. నేరుగా రోడ్డు ప‌క్క‌నే ఉన్న ఓ డెంట‌ల్ క్లినిక్ రెండో అంత‌స్తును ఢీ కొట్టి, అక్క‌డ ఇరుక్కుపోయింద‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here