శ్రీ కృష్ణుడి గుడి కోసం 2 కోట్ల రూపాయలు ప్రకటించిన పాకిస్థాన్..!

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రోవిన్స్ లో ఉన్న శ్రీకృష్ణుడి గుడి కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చింది. రావల్పిండి నగరంలో ఉన్న శ్రీ కృష్ణుడి గుడి బాగా ప్రసిద్ధి చెందింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ గుడిని పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయారు. దీంతో చాలా భాగాలలో రిపెరీలు అవసరం అయ్యాయి. ఇలాంటి తరుణంలో అక్కడి ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు శ్రీ కృష్ణుడి గుడి కోసం ప్రకటించడం విశేషం. ఈ విషయాన్ని అక్కడి మీడియా ప్రకటించింది.

జంట నగరాలైన రావల్పిండి-ఇస్లామాబాద్ లలో ప్రస్తుతం భక్తులు వెళుతున్న గుడి ఒక్కటే ఒకటి..! ఈ గుడిలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా పూజలు జరుగుతాయట. అయితే కేవలం ఆరు లేదా ఏడు మంది మాత్రమే పూజలు చేయడానికి వస్తుంటారట. ప్రస్తుతం పునర్నిర్మాణం కోసం ఓ కమిటీని నిర్ణయించింది స్థానిక ప్రభుత్వం. ఇప్పటికే వారు గుడిని చూశారు.. త్వరలో పనులు మొదలుపెట్టబోతున్నారట. ప్రస్తుతం ఈ గుడిలో ఎక్కువ మంది పట్టడం లేదు.. అందుకోసమే గుడిని పునర్నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. ఈ గుడిని 1897 లో కంజి మల్, ఉజాగర్ మాల్ రామ్ రాచపాల్ లు కట్టించారట. విభజన తర్వాత హిందువుల జనాభా తగ్గిపోవడం కారణంతో పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఉన్న ఒక్కగానొక్క గుడి కావడంతో అక్కడ ఉన్న హిందువులు పూజలు చేసుకోడానికి వస్తూ ఉన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here