`చ‌చ్చిపోతా..`అంటూ ఫోన్‌లో మాట్లాడుతూనే కాలువ‌లోకి దూకేసిన యువ‌తి!

క‌ర్నూలు: తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని ఫోన్‌లో చెబుతూ కాలువ‌లోకి దూకేసిందో యువ‌తి. జీవితంపై విర‌క్తి క‌లిగింద‌ని, చ‌చ్చిపోవాల‌నిపిస్తోంద‌ని అంటూ ఫోన్‌లో త‌న అమ్మ‌మ్మ‌తో చెప్పింది, ఆమె లైన్‌లో ఉండ‌గానే హంద్రీనీవ కాలువ‌లోకి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

ఆ యువ‌తి పేరు ఝాన్సీ. క‌ర్నూలు జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లుకు చెందిన ఝాన్సీ కొన్ని నెల‌లుగా క‌ర్నూలు జిల్లా మ‌ద్దికెర‌లోని త‌న అమ్మ‌మ్మ ఈశ్వ‌ర‌మ్మ ఇంట్లో ఉంటూ చ‌దువుకుంటోంది. కొద్దిరోజులుగా ఈశ్వ‌ర‌మ్మ‌తో ఝాన్సీకి విభేదాలు త‌లెత్తాయి. దీనితో త‌ర‌చూ ఈశ్వ‌ర‌మ్మ ఆమెను తిడుతుండేది.

దీనితో మ‌న‌స్తాపానికి గురైన ఝాన్సీ తాను గుంత‌క‌ల్లుకు వెళ్తున్నాన‌ని చెప్పి, ఈ నెల 12న మ‌ద్దికెర నుంచి బ‌య‌లుదేరింది. అదే రోజు సాయంత్రం హంద్రీనీవా కాలువ వ‌ద్ద‌కు చేరుకుంది. ఈశ్వ‌ర‌మ్మ‌కు ఫోన్ చేసి.. తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని చెప్పి, కాలువ‌లోకి దూకేసింది. బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది.

ఝాన్సీ ఆచూకి తెలియ‌క‌పోవ‌డంతో ఈ నెల 15వ తేదీన త‌ల్లిదండ్రులు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు న‌మోదు చేసిన పోలీసులు ఝాన్సీ కోసం అన్వేషిస్తుండ‌గానే.. అనంత‌పురం జిల్లాలోని వ‌జ్ర‌క‌రూరు వ‌ద్ద ఆమె మృత‌దేహం ల‌భ్య‌మైంది. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here