బ్రేకింగ్ న్యూస్: కుప్పకూలిన మిలటరీ విమానం.. 100మందికి పైగా మృతి..!

అల్జీరియాకు చెందిన ఓ విమానం కుప్పకూలిన ఘటనలో వందమందికి పైగా మరణించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8గంటల సమయంలో బౌఫరిక్ ఎయిర్ పోర్టు నుండి విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలిపోయినట్లు లోకల్ మీడియా తెలిపింది. 200 మందికి పైగా ఆ విమానంలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే అందులో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో ఇంకా క్లారిటీ లేదు.

అల్జీరియా న్యూస్ ఛానల్ డియా అల్జీరీ కథనం ప్రకారం ఘటనా స్థలిలో 130 మంది ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. డజన్ కు పైగా అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయి. అల్జీరియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే ఇది అతి పెద్ద ప్రమాదమని చెబుతున్నారు. అల్జీరియా లోని ఉత్తరతీరంలో ఉన్న బౌఫరిక్ ఎయిర్ పోర్టును మిలటరీ ఎయిర్ బేస్ గా కూడా పరిగణిస్తారు. అల్జీరియా రాజధానికి 30కిలోమీటర్ల దూరంలో ఉంది. బిచార్ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. ఇంతకూ మొత్తం ఎంతమంది చనిపోయారు అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here