రోడ్డు ప‌క్క‌న ఆగి ఉన్న కారులో భ‌ర్త‌తో ఓ మ‌హిళ‌.. న‌లుగురు యువ‌కుల పైశాచికం!

మూత్ర విస‌ర్జ‌న కోసం భ‌ర్త త‌న కారును రోడ్డు ప‌క్క‌న ఆప‌డమే పాప‌మైంది. ఆగిన కారులో ఉన్న ఆయ‌న భార్య‌ను చూసిన ముగ్గురు కామాంధులు.. ప‌శువుల్లా ప్ర‌వ‌ర్తించారు.

త‌మ వ‌ద్ద ఉన్న నాటు తుపాకీని గురి పెట్టి మ‌రీ.. అత‌ని భార్య‌పై పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలోని గుర్‌గ్రామ్‌లో చోటు చేసుకుంది.

ఇప్ప‌టికే వ‌రుస అత్యాచారాలు, హ‌త్య‌ల‌తో అట్టుడికిపోతున్న హ‌ర్యానాలో ఇది మ‌రో దారుణ ఘ‌ట‌న‌. గుర్‌గ్రామ్‌కు చెందిన 22 ఏళ్ల మహిళ తన భర్త, మ‌రిదితో క‌లిసి బంధువుల ఇంట్లో ఓ శుభ కార్యానికి హాజర‌య్యారు.

ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో.. భ‌ర్త మూత్ర విస‌ర్జ‌న కోసం కారును రోడ్డు ప‌క్క‌న ఆపారు. అంతే.. వారి వెనుకే రెండు కార్ల‌లో వ‌స్తోన్న న‌లుగురు యువ‌కులు అడ్డుకున్నారు.

ఇక్క‌డెందుకు ఆపారంటూ బెదిరించారు. త‌మ వ‌ద్ద ఉన్న నాటు తుపాకీతో వారిపై దాడి చేశారు. కారులో ఉన్న మహిళను రోడ్డు ప‌క్క‌న‌ పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళ భర్త, మ‌రిదిని తుపాకీతో భ‌య‌పెట్టారు. అత్యాచారం అనంత‌రం నలుగురు యువకులు అక్కడి నుంచి పారిపోయారు.

మహిళ భర్త నిందితుల కారు నంబరును పోలీసుల‌కు తెలియ‌జేశారు. దీనితో ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు కారు నంబర్ల ఆధారంగా వారిని అరెస్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేయ‌గా.. మ‌రొక‌రు ప‌రారీలో ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here