ఒక్క ల‌వ‌ర్ కోసం ముగ్గురు అమ్మాయిలు..స్టేష‌న్‌లో పోలీసుల ఎదుటే!

ల‌క్నో: ఒకరికి తెలియ‌కుండా ఒక‌రుగా ముగ్గుర‌మ్మాయిల‌ను ప్రేమ‌లో దించాడో యువ‌కుడు. రెండేళ్ల పాటు ఈ ప్రేమ వ్య‌వ‌హారాన్ని ర‌హ‌స్యంగా ఉంచాడు. బ‌య‌టికి రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. నిజం నిప్పులాంటిదన్న‌ట్టు.. బ‌య‌టికి పొక్కేసింది. ఒకేసారి ముగ్గురితో ప్రేమ వ్య‌వ‌హారం కొన‌సాగిస్తున్నాడ‌నే వెల్ల‌డైంది.

దీనితో ఆ ముగ్గుర‌మ్మాయిల్లో ఒక‌రు త‌న ల‌వ‌ర్‌పై ఫిర్యాదు చేయ‌డానికి పోలీస్‌స్టేష‌న్‌కు చేరుకుంది. త‌న ల‌వ‌ర్‌పై ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసు ఆ ల‌వ‌ర్‌ను ప‌ట్టుకొచ్చి క‌ట‌క‌టాల వెన‌క్కి నెట్టారు. అక్క‌డే అస‌లు డ్రామా మొద‌లైంది. ఈ విష‌యం తెలుసుకున్న మిగిలిన ఇద్ద‌ర‌మ్మాయిలు పోలీస్‌స్టేష‌న్‌కు చేరుకున్నారు.

ఫిర్యాదు చేసిన అమ్మాయితో గొడ‌వ ప‌డ్డాడు. ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. జుట్టు ప‌ట్టుకుని ఈడ్చి కొట్టారు. ఇదంతా పోలీసుల స‌మ‌క్షంలోనే చోటు చేసుకుంది. విచిత్ర‌మేమిటంటే.. ఆ ముగ్గురు యువతులు కూడా త‌మ‌కు అత‌నే కావాలంటూ ప‌ట్టుబ‌ట్ట‌డం. ఇదంతా పోలీసుల‌కు కూడా విచిత్రంగా అనిపించింది.

పోలీస్‌స్టేష‌న్‌లో త‌మ ఎదురుగానే ఘ‌ర్ష‌ణ‌కు దిగిన ఆ ముగ్గుర్నీ లాకప్‌లో పెట్టారు వేర్వేరుగా. వారి త‌ల్లిదండ్రుల‌ను పిలిపించి, కౌన్సెలింగ్ ఇప్పించారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని గౌత‌మ‌బుద్ధ న‌గ‌ర్ జిల్లాలోని నోయిడా సెక్టార్ 24 పోలీస్‌స్టేష‌న్‌లో చోటు చేసుకుంది. ఆ యువ‌కుడి పేరు నాథ్‌సింగ్‌. బులంద్‌ష‌హ‌ర్‌కు చెందిన అత‌ను నాలుగేళ్ల కింద‌ట ఉపాధి కోసం నోయిడాలోని సెక్టార్ 3లో నివ‌సిస్తున్నాడు.

బులంద్‌ష‌హ‌ర్‌లో త‌న చిన్న‌నాటి స్నేహితురాలిని ప్రేమించాడు. నోయిడాకు వ‌చ్చిన త‌రువాత త‌న తోటి మ‌హిళా ఉద్యోగిని ముగ్గులోకి దింపాడు. అనంత‌రం ఆమె స్నేహితురాలితో ప్రేమాయ‌ణం సాగించాడు. ఈ విష‌యం తెలియ‌డంతో నాథ్‌సింగ్ తోటి ఉద్య‌గిని పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌గా.. మిగిలిన ఇద్ద‌రూ అడ్డుకుని, ప‌రస్ప‌రం ఘ‌ర్ష‌ణ‌కు దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here