హెలీకాప్టర్ నుండి కింద పడ్డ భారత జవాన్లు..!

ఎగురుతున్న హెలికాఫ్టర్ నుంచి ప్రమాదవశాత్తూ ఆర్మీ జవాన్లు కిందపడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. జనవరి 15న జరుగనున్న ‘ఆర్మీ డే’ ను పురస్కరించుకుని ఢిల్లీలో గురువారం జవాన్లంతా పరేడ్ డ్రిల్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పరేడ్ మైదానం వద్ద హెలికాఫ్టర్ నుంచి తాడుతో దిగుతుండగా ప్రమాదవశాత్తూ ముగ్గురు జవాన్లు కిందపడ్డారు. గాయప‌డిన ముగ్గురు జవాన్లను వెంట‌నే సమీప ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘటనలో వారి ప్రాణాల‌కు ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని, స్వ‌ల్పంగా గాయాలు అయినట్టు వైద్యులు వెల్లడించారు.

జవాన్లు ఒకరి తరువాత మరొకరు ఒకే తాడుపై నుంచి కిందికి దిగుతున్న క్రమంలో వారి బరువుకు ఆ తాడు కాస్త తెగిపోయింది. దాంతో దిగుతున్న నాలుగో జవాన్ కింద ఉన్న ముగ్గురు జవాన్లపై పడ్డాడు. దీంతో నాలుగో జవాన్ కూ.. కింద ఉన్న వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనవరి 9 న ఈ వీడియోను రికార్డు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here