60 ఏళ్ల మహిళ కడుపులో నుండి దీన్ని బయటకు తీశారు..!

60 ఏళ్ల మహిళ గత రెండేళ్ళ నుండి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఉండేది. ఆ కడుపునొప్పి దెబ్బకు ఆమె కనీసం కూర్చోవడం కూడా సాధ్యం అయ్యేది కాదు. ఇక నొప్పిని భరించలేక ఆమె డాక్టర్ ను సంప్రదించింది. వైద్యులు ఆమెకు సోనోగ్రఫీ నిర్వహించాలని తెలిపారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో ఉన్న విషయం ఆమెకు.. ఆమె కుటుంబ సభ్యులకు తెలపడంతో వారంతా షాక్ కు గురయ్యారు.

ఎందుకంటే ఆ మహిళ కడుపులో దాదాపు మూడు కేజీల బరువున్న ట్యూమర్ ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జాబువా జిల్లా ఆసుపత్రిలో ఒకటిన్నర గంట పాటూ సర్జరీ నిర్వహించి ఆమె కడుపులో ఉన్న ట్యూమర్ ను బయటకు తీశారు. ఆమె గర్భాశయంలో చిన్నగా ఉన్న ట్యూమర్ అలా పెరిగి పెరిగి పెద్దదయ్యింది. నొప్పి ఎక్కువగా ఉన్నా కూడా ఆమె పట్టించుకోకుండా ఉండడంతో అది పెద్దగా మారింది. సర్జరీ తప్ప ఇటువంటి వాటికి ఏ చికిత్సా లేదని వైద్యులు చెప్పడంతో ఆపరేషన్ కు ఆమె ఒప్పుకుంది. దాని బరువు 2.9కిలోలు ఉంది. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం బాగానే ఉంది. కొద్ది రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జి చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here