మూడునెల‌ల ప‌సిపాప త‌ల‌: మొండెం లేకుండా..చంద్ర‌గ్ర‌హ‌ణం మ‌రుస‌టి రోజే

హైదరాబాద్‌: గ్ర‌హ‌ణ స‌మ‌యంలో దేవ‌త‌ల శ‌క్తి బ‌ల‌హీన‌మౌతుంద‌ని చెబుతుంటారు. ఆ స‌మ‌యంలో క్షుద్ర‌శ‌క్తులు విప‌రీత‌మైన బ‌లాన్ని సాధిస్తాయ‌ని, దుష్ట‌శ‌క్తులు చెల‌రేగుతాయ‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు.

అందుకే- క్షుద్ర‌శ‌క్తుల‌ను త‌మ ఆధీనంలోకి తెచ్చుకోవ‌డానికి గ్ర‌హ‌ణ స‌మ‌యంలో మంత్ర‌గాళ్లు క్షుద్ర‌పూజ‌లు చేస్తుంటార‌ని చిన్న‌ప్ప‌టి నుంచీ వింటూ వ‌స్తున్న‌దే.

ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో మ‌న‌కు తెలియ‌దు. తాజాగా ఉప్ప‌ల్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న మాత్రం.. ఇది నిజ‌మే అని అనిపించేలా ఉంది.

ఎందుకంటే- చంద్ర‌గ్ర‌హణానికి మ‌రుస‌టి రోజే ఉప్ప‌ల్ స‌మీపంలోని చిలుకాన‌గ‌ర్‌లో ఓ ఇంటి డాబాపై మూడునెల‌ల చిన్నారి త‌ల లేని మొండెం క‌నిపించింది.

చంద్ర‌గ్ర‌హ‌ణం మ‌రుస‌టి రోజే ఇది క‌నిపించ‌డంతో న‌ర‌బ‌లి ఇచ్చి ఉంటార‌ని, క్షుద్ర‌పూజ‌లు చేసి ఉంటార‌ని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

త‌ల మాత్ర‌మే ఉంది. మొండెం, కాళ్లూ, చేతులూ ఇప్ప‌టికీ దొర‌క‌ట్లేదు. డాబా మీద బ‌ట్ట‌లు ఆరేయ‌డానికి వెళ్లిన ఓ మ‌హిళ మొద‌ట‌గా దీన్ని గుర్తించారు.

వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు ఆ త‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. మొండెం కోసం గాలిస్తున్నారు. రాజ‌శేఖ‌ర్ అనే క్యాబ్‌డ్రైవ‌ర్‌ది ఆ ఇల్లు.

గురువారం మ‌ధ్యాహ్నం బట్టలు ఆరవేయడానికి డాబా మీదికి వెళ్లిన ఆయ‌న‌ అత్త మొద‌ట‌గా చిన్నారి తలను చూశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.

పోలీసుల‌ జాగిలాలు తల లభ్యమైన ఇంటి పక్కన నివాసముండే నరహరి అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లాయి. దీనితో పోలీసులు నరహరిని అదుపులోకి తీసుకున్నారు. రాజశేఖర్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

చిన్నారి తల ఎవరిది? అనే విషయం ఇంకా తేలలేదు. త‌ల‌కు కుడివైపు చెవి లేక‌పోవ‌డం, ద‌వ‌డ‌పై క‌త్తిగాట్లు ఉండ‌టంతో ఖ‌చ్చితంగా న‌ర‌బ‌లే అయి ఉంటుంద‌ని స్థానికులు అనుమానిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here