15 వేల అడుగుల ఎత్తులో విమానం కిటికీ అద్దం ఊడి వ‌స్తే!

చండీగ‌ఢ్‌: ఎయిరిండియాకు విమానానికి పెను ప్రమాదం తప్పింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీకి 240 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న‌ప్పుడు దాని కిటికీ అద్దం ఒక‌టి ఊడి లోనికి ప‌డింది. కిటికీ ప‌క్క‌నే కూర్చున్న ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలి నెత్తిన ప‌డిందా అద్దం.

అమృత్‌స‌ర్ విమానాశ్ర‌యం నుంచి టేకాఫ్ తీసుకున్న‌ కొద్ది సేపటికే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీనితో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం 15వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ప్రతికూల వాతావరణం కారణంగా విమాన కిటికీ ఒక్కసారిగా తెరుచుకుందని విమానయాన అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయంలో ప్రాథమిక చికిత్స అందించారు. ఎయిర్‌హోస్టెస్‌ కిటికీని యథాస్థానంలో ఉంచేందుకు ప్రయత్నించినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని డీజీసీఏ అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here