ముగ్గురు ఖైదీలు.. జైల్లో సెల్ఫీ తీసుకొని.. ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు..!

ముగ్గురు ఖైదీలు.. ఎవరైతే ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటూ ఉన్నారో.. వారంతా కలిసి జైల్లోనే సెల్ఫీ తీసుకొని.. ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ముజఫర్ నగర్ జిల్లా జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్మార్ట్ ఫోన్ ను ఎలా లోపలికి తీసుకొని వెళ్ళారో తెలీదు కానీ.. జైలు లోపల ఫోటోలు దిగి.. ఫేస్ బుక్ లో అప్లోడ్ చేశారు. ఆ తర్వాత ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఖైదీలు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే దాకా జైలు అధికారులు వారి దగ్గర ఫోన్ ఉందని గుర్తించలేకపోయారు. ఈ ఘటనకు విచారణ మొదలుపెట్టిన పోలీసులు ఆ ఖైదీల గదిలో వెతకగా స్మార్ట్ ఫోన్ లభించింది. దాన్ని పోలీసులు సీజ్ చేశారు.

దీంతో వారి మీద మరో కేసును కూడా పెట్టారు పోలీసులు. జైలు సూపరిండెంట్ మాట్లాడుతూ ఆ ముగ్గురు ఖైదీలు.. మర్డర్, అటెంప్ట్ టు మర్డర్ కేసుల్లో జైలుకు వచ్చారని చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఓ లాయర్ తన క్లయింట్ కు ఫోన్ అందిస్తుండగా పట్టుకొని అరెస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here