31 మందికి ఒకేసారి అంత్యక్రియలు.. 50 అడుగుల చితి.. పాపం..!

ఒకేసారి 31మంది శవాలు.. ఎక్కడి నుండి వచ్చారో ఏమో కానీ.. అనాధ శవాలకు ఒకేసారి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాంచీ లోని రిమ్స్ ఆసుపత్రిలో చాలా రోజుల నుండి ఉన్న అనాధ శవాలకు ఇలా తుది వీడ్కోలు పలికారు. జుమార్ నదీ తీరంలో ఇలా ఒకే చితి మీద.. ఒకే సారి ఉంచి నిప్పంటించారు.

దాదాపు రెండు నెలలుగా ఆ శవాలు రిమ్స్ లో ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రం లోని అతిపెద్ద వైద్యశాలలో ఇది కూడా ఒకటి. చనిపోయిన చాలా మంది ఆచూకీ కనుక్కోడానికి పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఒక్కరి ఆచూకీ కూడా లభించలేదు. దీంతో ఇక ఎన్నాళ్ళు ఆసుపత్రిలో ఉంచుకుంటాం అన్న కారణంతో ఈ పని చేసింది ఆసుపత్రి బృందం. పాపం ఎక్కడి నుండి వచ్చారో ఏమో.. ఇక్కడ బూడిద అయ్యారు అని స్థానికులు అనుకుంటూ ఉన్నారు.

మూడు ట్రాక్టర్లలో ఈ శవాలను జుమార్ నదీ తీరానికి తీసుకొని వచ్చారు. 31 మంది మృతదేహాలలో 8 మహిళలవే..! దాదాపు 50 అడుగుల చితి పేర్చి దాని మీద శవాలను ఉంచి నిప్పంటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here