670కోట్ల రూపాయలు విలువ చేసే ఈ వస్తువు.. 10 సంవత్సరాలుగా మామూలు రాయి అని అనుకున్నాడు..!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10 ఏళ్ల పాటూ అక్కడి వాళ్ళు దీన్ని మామూలు తెల్లటి రాయి అని అనుకున్నారు. కానీ కొందరికి డౌట్ వచ్చి పరీక్షించగా.. ఇది ఒక ముత్యం అని తేలింది. ఏకంగా 34కేజీల బరువు ఉన్న ఈ ముత్యం విలువ మార్కెట్ లో 670కోట్ల రూపాయలట. ప్రపంచంలోనే అతి పెద్ద ముత్యం ఇదేనని అక్కడి వాళ్ళు అంటున్నారు.

ఇది ఫిలిప్పైన్స్ దేశంలో చోటుచేసుకుంది. ఓ చేపలు పట్టే వ్యక్తి వద్ద 10సంవత్సరాల నుండి ఈ ముత్యం ఉంది. అయితే అతడు అన్ని సంవత్సరాలు పేదరికంలోనే గడిపాడు. ఇదేదో తెల్ల రాయి అని అనుకున్నాడు తప్పితే దాని గురించి తెలుసుకోవాలని అనుకోలేదు. తన ఇంట్లోనే పెట్టుకున్న అతడు ఎప్పటికప్పుడు సంపాదించుకుంటూ తింటూ ఉండేవాడు. అయితే ఒకసారి అతడి ఇళ్ళు కాలిపోయింది.. దీంతో ఆ ఇంట్లో ఉన్న సామాన్లను తీసుకొని వేరే చోటుకు వెళుతుండగా ఓ అధికారి అతడి సామాన్లలో ఉన్న ఈ తెల్లటి రాయిని చూశాడు. అప్పుడు దీన్ని పరీక్షించగా అది ఓ ముత్యం అని.. ఏకంగా 670కోట్ల విలువైనదని చెప్పాడు. దాదాపు 34 కిలోల బరువు ఉంది.

2006 సంవత్సరంలో ఆ వ్యక్తి పాలావాన్ ద్వీపంలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. అప్పుడు అతడి వలలో ఏదో రాయి లాంటిది ఉండడాన్ని చూశాడు. దాన్ని తీసుకొని అతడు ఇంటికి వచ్చేశాడు. ఏదో తెల్లరాయి ఇది..చూడడానికి బాగుంది.. అదృష్టం కలిసొస్తుందేమోనని అనుకొని బరువు ఎక్కువైనా కూడా ఇంటికి మోసుకొని వచ్చాడు. అయితే అది ఏమిటి అని కూడా అతడు ఆలోచించలేదు.. కాని దశాబ్దం తర్వాత ఆ అధికారి చూడడంతో అతడు ఏకంగా కోట్లకు అధిపతి అయ్యాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here