ఉమ్రా యాత్ర‌లో అప‌శృతి!

రియాద్‌: సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు బ్రిట‌న్ దేశ‌స్తులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముస్లింల ప‌విత్ర స్థ‌లం మక్కాకు 30 మైళ్ల దూరంలో ఉన్న అల్‌ ఖలాస్‌ పట్టణంలో ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. ఉమ్రా యాత్ర కోసం వ‌చ్చిన భ‌క్తుల‌తో వెళ్తున్న బస్సును ఎదురుగా వ‌చ్చిన ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది.

గాయపడిన 12 మంది కూడా బ్రిటిష్‌ జాతీయులేనని సౌదీ అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని మక్కాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటిస్తూ సౌదీ అంబాసిడర్‌ మహ్మద్‌ బిన్‌ నవాఫ్‌ ట్వీట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here