అప్పు చెల్లించ‌లేద‌ని..నాలుగేళ్ల కుమార్తెను ఎత్తుకెళ్లింది! ఇంత‌కీ రుణ‌మొత్తం ఎంతో తెలుసా?

భువ‌నేశ్వ‌ర్‌: రుణం చెల్లించ‌ట్లేద‌ని నాలుగేళ్ల కుమార్తెను ఎత్తుకెళ్లిన ఉదంతం ఇది. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో చోటు చేసుకుంది. ఇంత‌కీ అప్పు మొత్తం తెలుసా? 9000 రూపాయ‌లు. అక్ష‌రాలా తొమ్మిది వేల రూపాయ‌లు మాత్ర‌మే. ఇందులో 3000 రూపాయ‌ల‌ను బాధిత కుటుంబం చెల్లించింది కూడా.

జిల్లాలోని బ‌న్‌పూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న ఝియాంకా సాహి గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఝియాంకా సాహి గ్రామానికి చెందిన ఓ నీల‌మ‌ణి సాహు అనే మ‌హిళ ఆంగ‌న్‌వాడి కార్య‌క‌ర్త‌గా ప‌నిచేస్తోన్న ల‌బాణి సాహు వ‌ద్ద 9000 రూపాయ‌లను అప్పుగా తీసుకుంది. ఇందులో 3000 రూపాయ‌ల‌ను ఆమె చెల్లించింది కూడా. అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికిప్పుడు అప్పుతో పాటు వ‌డ్డీని కూడా క‌ట్టాల‌ని గొడ‌వేసుకుంది.

తాము చెల్లించ‌లేమ‌ని, గ‌డువు కావాల‌ని నీల‌మ‌ణి కోర‌డంతో ఆగ్ర‌హానికి గురైన ల‌బాణి సాహు.. స్కూల్ నుంచి వ‌చ్చిన నాలుగేళ్ల కుమార్తెను ఎత్తుకెళ్లింది. ఇంట్లో నిర్బంధించింది. ఆ పాప ఏడుస్తున్నా వ‌ద‌ల్లేదు. దీనితో నీల‌మ‌ణి బ‌న్‌పూర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ల‌బాణి ఇంటికి వెళ్లి, పాప‌ను విడిపించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here