ఆటో ట్రాలీలో 40 కోట్ల రూపాయలు ఇలా బహిరంగంగా.. ఎక్కడో తెలుసా..?

డబ్బులు ఎవరైనా తీసుకొని వెళ్తున్నారంటే కాస్తంత జాగ్రత్తగానో.. ఎవరికీ కనపడకుండానో తీసుకొని వెళ్ళాలి..! మనం ఒక 10 వేల రూపాయలు తీసుకొని వెళ్తున్నామంటేనే ఎవరికీ కనపడకుండా ఎక్కడో దాచుకొని తీసుకొని వెళ్తాం..! అదే 40 కోట్ల రూపాయలు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. కానీ ఇదేదీ పట్టించుకోలేదు మన ప్రభుత్వ అధికారులు. ఏకంగా ఆటో ట్రాలీలో తీసుకొని వెళ్ళారు. అదీ అందరికీ కనిపించే విధంగా..! ఇంతకూ ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారో చెప్పండి..? మన నల్గొండ జిల్లాలో..!

నిజంగా మీకు కూడా షాకింగ్ గా అనిపిస్తోంది కదూ.. వార్త చదివిన మనకే అలా అనిపిస్తే.. ఇక అక్కడ చూసిన వాళ్లకు ఎలా అనిపించాలి. ఓపెన్ ట్రాలీలో ఎటువంటి రక్షణా లేకుండా 40 కోట్ల రూపాయలను నల్గొండ జిల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు తరలించారు. జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి రూ. 40 కోట్లను గ్రామీణ వికాస్ బ్యాంకుకు తరలించేందుకు ఆటో ట్రాలీలో నోట్ల కట్టలను సర్దారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా, సీఐ, ఎస్ఐ తదితరులు రంగంలోకి దిగారు. ఇంత భారీగా నగదును సెక్యూరిటీ లేకుండా ఎలా పంపుతున్నారని నిలదీశారు. నగరంలోని మరో ప్రాంతానికే అయినా, సెక్యూరిటీ లేకుండా పంపడం సరికాదని, తమకు సమాచారం ఇవ్వాల్సి వుందని అన్నారు. ఆపై సెక్యూరిటీని ఏర్పాటు చేసి డబ్బును తరలించారు. కనీసం ఏదైనా గుడ్డలు పెట్టో తరలించి ఉండి ఉంటే ఇంత జరిగేది కాదేమో..! ఈ ఘటనపై ఎస్బీఐ ఉన్నతాధికారులు కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here