నిదానంగా వెళ్ల‌డ‌మే ప్రాణాల‌ను కాపాడింది!

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని క‌త్ని జిల్లాలో ఓ ప్యాసింజ‌ర్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. అయిదు బోగీలు ప‌ట్టాల మీది నుంచి ప‌క్క‌కు ఒరిగిపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాపాయం త‌ప్పిన‌ప్ప‌టికీ.. 12 మంది ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. క‌త్ని-చౌపాన్ ప్యాసింజ‌ర్‌ జిల్లాలోని స‌ల్నా-పిపారియా క‌లాన్ మార్గంలో ప‌ట్టాలు త‌ప్పింది. రైలులో పెద్ద‌గా ప్ర‌యాణికులు లేరు.

అయిదు బోగీల్లో సుమారు పాతిక‌మంది ప్యాసింజ‌ర్లు ఉన్నారు. వారిలో 12 మందికి గాయాల‌య్యాయి. ఈ స‌మాచారం అందుకున్న వెంట‌నే రైల్వే భ‌ద్ర‌తా సిబ్బంది, పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

గాయ‌ప‌డ్డ వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప‌ట్టాలు త‌ప్పే స‌మ‌యంలో రైలు అతి నెమ్మ‌దిగా వెళ్లింద‌ని, అదే త‌మ‌ను కాపాడింద‌ని ప్ర‌యాణికులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here