స్లైడ‌ర్ కిటికీ ఎంత ప‌ని చేసింది?

ఫ్లాట్ అందంగా ఉండ‌టానికి, సౌక‌ర్య‌వంతంగా ఉండ‌టానికి ఏర్పాటు చేసుకున్న ఓ స్లైడ‌ర్ కిటికీ ఓ చిన్నారి మ‌ర‌ణానికి కార‌ణ‌మైంది. స్లైడ‌ర్ కిటికీ వ‌ద్ద నిల్చుని ఆడుకుంటూ, ఎనిమిదో అంత‌స్తు నుంచి కింద ప‌డి మ‌ర‌ణించిందా పాప‌. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న‌ క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరులో చోటు చేసుకుంది.

అల్లారుముద్దుగా, అపురూపంగా చూసుకుంటున్న త‌మ కుమార్తె ఇక లేద‌నే బాధ‌ను దిగ‌మింగుకోలేక‌పోతోంది ఆ కుటుంబం. ఆ బాలిక పేరు శాన‌ల్ జెనీషియా డిసౌజా. వ‌య‌స్సు అయిదేళ్లు. మంగ‌ళూరు శ‌క్తిన‌గ‌ర‌లోని ప‌దంత‌స్తుల అపార్ట్‌మెంట్‌లో త‌ల్లిదండ్రులు విల్స‌న్‌, ఆలితాల‌తో క‌లిసి నివ‌సిస్తోంది.

ఎనిమిదో అంత‌స్తులో విల్స‌న్‌కు ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్‌కు అమ‌ర్చిన స్లైడ‌ర్ కిటికీ వ‌ద్ద నిల్చుని ఆడుకుంటూ, శాన‌ల్‌.. ఎనిమిదో అంత‌స్తు నుంచి కింద ప‌డి దుర్మ‌ర‌ణం పాలైంది. ఈ ఘ‌ట‌న‌పై శంక‌నాడి పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. స‌రైన రక్ష‌ణ చ‌ర్య‌లు లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని పోలీసులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here