ఓవర్ కి ఏడు బంతులు.. సన్ రైజర్స్ మ్యాచ్ లోనే..!

సాధారణంగా ఓవర్ కు 6 బంతులు మాత్రమే ఉంటాయి.. కానీ కొన్ని కొన్ని సార్లు అంపైర్ల తప్పిదం వలన తక్కువ బంతులో.. ఎక్కువ బంతులో వేయాల్సి ఉంటుంది. అదేదో గల్లీ క్రికెట్ లోనో చేసిన తప్పిదం కాదు.. ఏకంగా ఐపీఎల్ మ్యాచ్ లో.. అది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన మొదటి మ్యాచ్ లో ఇలా జరిగింది.

కామెంట్రేటర్ ఆకాష్ చోప్రా దీని మీద స్పందించాడు. ‘హైదరాబాద్ vs సన్‌రైజర్స్ మ్యాచ్‌లో అంపైర్ల తప్పిదం కారణంగా ఓ ఓవర్‌లో ఏడు బంతులు విసిరారు. థర్డ్ అంపైర్‌ కూడా ఈ తప్పిదాన్ని గుర్తించలేదు. ఇలాంటి తప్పులు కొన్ని మ్యాచ్‌ల్లో ఎక్కువ మ్యూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని అన్నాడు. ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలని చాలా మంది అభిప్రాయపడ్డారు.

సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. ఓ ఓవర్‌లో 7 బంతులు వేయించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన లాలిన్‌‌తో ఫీల్డ్ అంపైర్ల తప్పిదం కారణంగా ఏడు బంతులు వేయాల్సి వచ్చింది. ఏడో బంతికి ధావన్ ఒక పరుగు రాబట్టాడు. అప్పటికే 126 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్ 103/1తో ఉంది. ఈ విషయాన్ని కామెంటేటర్లు బయట పెట్టారు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు ఇంకా 4.1ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఒకవేళ ఆఖరి బంతి వరకూ మ్యాచ్ వెళ్ళింటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here