ప్రైవేటు ఆసుప‌త్రి డ్రైనేజీ గుంత‌లో!

చిక్‌బ‌ళ్లాపుర‌: క‌ర్ణాట‌క‌లోని చిక్‌బ‌ళ్లాపుర జిల్లాలో దారుణ‌ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఓ ప్రైవేటు ఆసుప‌త్రి డ్రైనేజీ గుంత‌లో ఏడునెల‌ల గ‌ర్భ‌స్థ ఆడ శిశువు క‌నిపించ‌డం ఆందోళ‌న రేకెత్తించింది. జిల్లాలోని దొడ్డ‌బ‌ళ్లాపుర ప‌ట్ట‌ణంలోని మాన‌స ఆసుప‌త్రిలోని డ్రైనేజీ గుంత‌లో ఈ శిశువు నిర్జీవంగా క‌నిపించింది.

ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. శిశువు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఆసుప‌త్రి యాజ‌మాన్యంపై కేసు న‌మోదు చేశారు. భ్రూణ‌హ‌త్య‌గా కేసు న‌మోదు చేశారు. ఆడ‌బిడ్డ అని తేల‌డంతో ఎవ‌రైనా గ‌ర్భాన్ని తీయించుకుని ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here