ఈ 70 ఏళ్ల బామ్మ ప్రెగ్నెంట్.. రిపోర్ట్స్ చూసి డాక్టర్లు కూడా షాక్..!

ప్రస్తుతం ఉన్న 70 ఏళ్ల వయసు వాళ్ళు అంటే నడవడానికి కూడా చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చూస్తున్న బామ్మ ప్రెగ్నెంట్ అది కూడా ఆరు నెలలు.. ఈ విషయం తెలిసి డాక్టర్లు కూడా షాక్ తిన్నారు తెలుసా..? మెక్సికో లోని సిన్ లోవాలో నివసిస్తున్న మరియా డి లాలూస్ ప్రస్తుతం ఆరునెలల ప్రెగ్నెంట్.. ఆమె గతం లోనే ఏడుగురు పిల్లలకు తల్లి కూడా..!

మొదట ఆమె చెప్పే దాన్ని ఎవరూ నమ్మలేదు. చాలా సార్లు వాంతులు రావడం.. మోకాళ్ళలో నొప్పి ఉంటే వైద్యులను సంప్రదించింది. వైద్యులు కాస్తా సోనోగ్రఫీ నిర్వహించగా ఆమె గర్భవతి అని తెలుసుకున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అందులో కూడా ఆమె గర్భవతి అనే తెల్సింది. ఆమె కడుపులో ఓ అమ్మాయి పెరుగుతోంది. మరియా కానీ జన్మనిస్తే ప్రపంచంలో బిడ్డ జన్మనిచ్చిన పెద్ద వయస్కురాలిలో రెండో మహిళగా రికార్డుకు ఎక్కుతుంది. గతంలో పంజాబ్ కు చెందిన దల్జిందర్ కౌర్ 70 ఏళ్ళు దాటాక కూడా బిడ్డకు జన్మనిచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here