74 సంవ‌త్స‌రాల వృద్ధురాల‌ని కూడా చూడ‌కుండా..!

భువ‌నేశ్వ‌ర్: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వృద్ధురాలి పేరు బ‌సంతి పలాట‌. వ‌య‌స్సు 74 సంవ‌త్స‌రాలు. దాదాపుగా అన్ని ఇళ్ల‌ల్లో ఉన్న‌ట్టే కోడలితో ఏవో గొడ‌వ‌లు ఉన్నాయి. అవి కాస్తా ముదిరాయి. దీనితో కోడ‌లు రీటా బారిక్ నేరుగా వెళ్లి పోలీస్‌స్టేష‌న్‌లో భ‌ర్త‌, అత్త‌పై ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పోలీసులు న‌మోదు చేసుకున్నారు. వారిద్ద‌ర్నీ పిలిపించి, విచారించారు.

అక్క‌డితో ఆగిపోయి ఉంటే బాగుండేది. 74 సంవ‌త్స‌రాల బ‌సంతి ప‌లాట‌ను పోలీసులు స్టేష‌న్‌లో క‌ట‌క‌టాల వెన‌క్కి నెట్టి కొట్టారు. లాఠీ దెబ్బ‌ల‌ను రుచి చూపించారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని పూరి జిల్లా నిమాపాడా గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సుమారు రెండు గంట‌ల పాటు లాక‌ప్‌లో ఉంచిన‌ట్లు చెబుతున్నారు. అనంత‌రం బ‌య‌టికి వ‌చ్చిన ఆ వృద్ధురాలు.. ఇన్‌స్పెక్ట‌ర్ మృత్యుంజ‌య స్వైన్, ఇద్ద‌రు కానిస్టేబుళ్లు త‌న‌ను లాఠీలతో చిత‌క‌బాదార‌ని ఆరోపిస్తున్నారు. ఒంటిపై తేలిన గాయాల‌ను చూపిస్తున్నారు.

కౌన్సెలింగ్ ఇస్తామ‌ని, రాజీ కుదుర్చుతామ‌ని త‌న‌ను, త‌న కుమారుడు అజ‌య్‌ని స్టేష‌న్‌కు పిలిపించార‌ని, అనంత‌రం ఇష్ట‌మొచ్చిన‌ట్టుగా కొట్టార‌ని బ‌సంతి ప‌లాట తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై బసంతి కుటుంబీకులు, బంధువులు నిమాపాడా పోలీస్‌స్టేష‌న్ వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టారు. ఇన్‌స్పెక్ట‌ర్ మృత్యుంజ‌య స్వైన్‌కు వ్య‌తిరేకంగా ఆమె పూరి ఎస్పీ సార్థ‌క్ సారంగికి ఫిర్యాదు చేవారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here