అత‌నికి ష‌ష్టిపూర్తి కార్య‌క్ర‌మాన్ని చేస్తున్నార‌ని అనుకుంటే పొర‌పాటే!

జైపూర్‌: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్నది 83 సంవ‌త్స‌రాల వ‌యోధిక వృద్ధుడు. పేరు సుఖ్‌రామ్ బారువా. ఊరు రాజ‌స్థాన్ క‌రౌలి జిల్లా స్యామ్‌ర‌ద‌. ఈ ఫొటోను చూసి.. అత‌నికి ష‌ష్టిపూర్తి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నార‌ని అనుకుంటే పొర‌పాటే.

కాటికి కాళ్లు చాపుకొన్న ఆ వ‌యోధిక వృద్ధుడు అచ్చంగా మూడో పెళ్లికి రెడీ అయ్యాడు. అదీ అస‌లు సంగ‌తి. త‌న‌కంటే- వ‌య‌స్సులో 53 సంవ‌త్స‌రాలు చిన్న అయిన యువ‌తిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా తీసిన పిక్ అది.

ఈ పెళ్లి త‌న‌కు వ‌ద్దంటూ ఆ యువ‌తి నెత్తీ, నోరు బాదుకున్న‌ప్ప‌టికీ.. ఎవ‌రూ వినిపించుకోలేదు. ఆ యువ‌తి వ‌య‌స్సు 20 సంవ‌త్స‌రాలే. ఇంత లేటు వ‌యస్సులో సుఖ్‌రామ్ పెళ్లి చేసుకోవ‌డానికి చెప్పిన కార‌ణం వింటే ర‌క్తం మ‌రిగిపోతుంది.

మ‌గ‌బిడ్డ కోస‌మే రెండో పెళ్లి చేసుకున్నాన‌ని చెబుతున్నాడు. ప్ర‌స్తుతం సుఖ్‌రామ్‌కు భార్య‌, న‌లుగురు కుమార్తెలు ఉన్నారు. వారంద‌రికీ పెళ్లిళ్లు కూడా అయిపోయాయి.

ఈ వ‌య‌స్సులో త‌న‌కు కుమారుడి ఆస‌రా కావాల్సి వ‌చ్చింద‌ని, అందుకే.. ఈ పెళ్లి చేసుకున్నాన‌ని అంటున్నాడు. విచిత్ర‌మేమిటంటే. ఈ పెళ్లి జ‌రిగి వారం రోజులైంది. ఎవ్వ‌రు కూడా దీనిపై నోరు విప్ప‌లేదు. దీనితో ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here