చాక్లెట్ కొనిస్తానని 9 ఏళ్ల బాలికని అత్యాచారం చేసిన కామాంధుడు సుబ్బయ్య ఇతడే..!

9 ఏళ్ల అమ్మాయిని 50 ఏళ్ల పైబడిన వ్యక్తి చాక్లెట్ కొనిస్తానని పిల్చుకొని వెళ్ళాడు. అతడి మాటలు నమ్మిన ఆ అమ్మాయి వెళ్ళింది. తీరా అతడు ఆమెను అత్యాచారం చేసి ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్లు కొనిస్తానని మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి ఆ బాలికను ఆమె ఇంటి వద్ద దింపేసి వెళ్లిపోయాడు. బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆ చిన్నారిని పరిశీలించగా జరిగిన ఘోరం బయటపడింది.

ఇప్పుడు ఈ విషయమై దాచేపల్లి అట్టుడుకుతోంది. దాచేపల్లి, మాచర్లలో ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బుధవారం రాత్రి నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బాలికపై అత్యాచార ఘటనకు నిరసనగా గురువారం బంద్‌కు పిలుపునిచ్చారు. మాచర్లలో ముస్లింలు రోడ్డుపై రాస్తారోకో చేశారు. నిందితుడు సుబ్బయ్యను వెంటనే అరెస్ట్‌ చేయాలని.. ఇలాంటి దారుణాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్యను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. సుబ్బయ్య ఫోటోను పోలీసులు విడుదల చేశారు. ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here