ఆ ఎమ్మెల్యేలు 97శాతం కోటీశ్వరులే..!

ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల గురించే దేశవ్యాప్తంగా చర్చించుకుంటూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంఖ్యా బలం లేకున్నా కూడా యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేసి.. ఆయనతో సంతకాలు కూడా చేయించేశారు. ఇక ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి జేడీఎస్, కాంగ్రెస్ లు తెగ కష్టపడిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఓ సరికొత్త అంశం బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ ఎన్నికల్లో నెగ్గిన వాళ్ళలో 97 శాతం మంది కోటీశ్వరులే..! టాప్ కోటీశ్వరులలో హోసకోట అసెంబ్లీ స్థానం నుంచి నెగ్గిన ఎన్. నాగరాజు ఆస్తులు అత్యధికంగా రూ.1015 కోట్లు ఉన్నాయట. 840 కోట్ల ఆస్తులతో మాజీ కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్ రెండవ స్థానంలో ఉన్నారు. హెబ్బల్ స్థానం నుంచి గెలిచిన బీఎస్ సురేశ్ 416 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన ఎమ్మెల్యేల్లో 97 శాతం మంది కోటీశ్వరులట. ఈ విషయాన్ని కర్నాటక ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పరిశోధన సంస్థ వెల్లడించింది. కర్ణాటక అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల ద్వారా కొత్తగా ఎన్నికైన 221 మంది ఎమ్మెల్యేల్లో.. 215 మంది కోటీశ్వరులున్నారని కర్నాటక ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తేల్చింది. ప్రతి ఎమ్మెల్యే సగటు ఆస్తులు సుమారు 35 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఎలక్షన్ అఫిడవిట్లో పేర్కొన్న అంశాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చామని ఈ సంస్థ వివరించింది.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన వారిలో 99 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఎమ్మెల్యే సగటు ఆస్తి సుమారు 60 కోట్లు ఉంటుంది. బీజేపీ పార్టీలో ఉన్న వారిలో 98 శాతం మంది కోటీశ్వరులున్నారు. అందులో ప్రతి ఎమ్మెల్యే ఆస్తి సగటును సుమారు 17 కోట్లు ఉంటుంది. జేడీఎస్ ఎమ్మెల్యేలు 95 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here