భద్రాద్రి: ఈ ఫొటోలో కనిపిస్తోన్న బాలుడి పేరు మధుకర్ రెడ్డి. వయస్సు ఆరేళ్లు. చింతకాయలు తినాలనిపించింది. తన స్నేహితులతో కలిసి స్కూల్ కాంపౌండ్ బయటే ఉన్న చింత చెట్టు వద్దకు వెళ్లి రాళ్లు, కర్ర ముక్కలను విసరసాగాడు. మొదట్లో ఒకట్రెండు తెగి కిందపడ్డాయి.
దీనితో మరింత ఉత్సాహంతో చేతికందిన రాళ్లు, కర్రముక్కలను విసరడం మొదలు పెట్టారు. మధుకర్ రెడ్డి స్నేహితుడు.. ఎలా విసిరాడో, ఎంత వేగంగా విసిరాడో గానీ ఓ కర్రముక్క నేరుగా ఇలా తల్లోకి దిగింది.
చెవి వెనుక భాగంలో లోతుగా కర్ర చొచ్చుకుపోయింది. వెంటనే ఆ బాలుడిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తరువాత హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.