షూట్ చేస్తుండ‌గానే కెమెరా క‌రిగిపోయింది..! అంతగా హీటెక్కించే సీన్ అది మ‌రి!

ఈ ఫొటోలు చూస్తోంటే.. కాస్త ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది. కాస్ట్‌లీ డీఎస్ఎల్ఆర్ కెమెరా అది. ఓ దృశ్యాన్ని షూట్ చేస్తుండ‌గానే.. ఆ హీట్‌కు మెల్ట్ అయిపోయింది ప్లాస్టిక్ వ‌స్తువులు క‌రిగిపోయిన‌ట్టు. దీన్ని చూసిన త‌రువాత అంతగా హీటెక్కించే ఆ దృశ్య‌మేంటో తెలుసుకోవాల‌నుకోవ‌డం అత్యంత స‌హ‌జం. అది రాకెట్ ప్ర‌యోగం.

అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ నాసా.. ఈ నెల 22వ తేదీన స్పేస్ ఎక్స్ రాకెట్‌ను అంత‌రిక్షంలోకి పంపించిన విష‌యం తెలిసిందే. స్పేస్ ఎక్స్ ఫాల్క‌న్ 9 రాకెట్‌ను నాసా అమెరికా కాలిఫోర్నియాలో వాన్డెన్‌బ‌ర్గ్‌లోని ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి ప్ర‌యోగించింది.

ఈ సంద‌ర్భంగా.. ఈ ప్ర‌యోగాన్ని చిత్రీక‌రించ‌డానికి ద స్పేస్ అండ్ ఏరోనాటిక్స్ ఏజెన్సీ అధికార ఫొటోగ్రాఫ‌ర్ బిల్ ఇంగ‌ల్స్ త‌న డీఎస్ఎల్ఆర్ కెమెరాతో వెళ్లారు. ఏరోనాటిక్స్ ఏజెన్సీలో ఫొటోగ్రాఫ‌ర్‌గా 30 సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉంది ఫొటోగ్రాఫ‌ర్ బిల్ ఇంగ‌ల్స్‌కు.

 

ఫాల్క‌న్ 9 రాకెట్ ప్ర‌యోగాన్ని చిత్రీక‌రిస్తున్న సంద‌ర్భంగా వెలువ‌డిన మంట‌ల వేడికి ఆ కెమెరా మొత్తం క‌రిగిపోయింది. అదృష్టం ఏమిటంటే- చిప్‌కు ఏమీ కాలేదు. స్పేస్ ఎక్స్ ఫాల్క‌న్ 9 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలు జిఫ్ ఫైల్‌గా షూట్ అయ్యాయి. దీన్ని ఆయ‌న నాసాకు అంద‌జేశారు. ఈ జిఫ్ ఫైల్‌ను నాసా విడుద‌ల చేసింది.

Credit: Bill Ingalls/NASA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here