రెండడుగుల వెడ‌ల్పు కూడా లేని గొయ్యిలో.. గోవు! ఊపిరాడ‌క‌!

కేబుళ్ల‌ను వేయ‌డానికి త‌వ్విన గొయ్యి అది. మ‌హా అంటే రెండు అడుగుల వెడ‌ల్పు ఉంటుందంతే. ఆ గొయ్యిలో ప‌డిందో గోవు. ఆ గొయ్యిలో ఇరుక్కుపోయింది. క‌ద‌ల్లేని స్థితిలో, ఊపిరి తీసుకోలేని ప‌రిస్థితిలో విల‌విల్లాడింది. అక్క‌డే ప్రాణాలొదిలింది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని మ‌డికెరి తాలూకా ప‌రిధిలోని క‌డ‌గ‌దాళు గ్రామంలో చోటు చేసుకుంది.

స్థానికంగా నివ‌సించే అజిత్ అనే వ్య‌క్తికి చెందిన ఆవు అది. మంగ‌ళ‌వారం రాత్రి పొర‌పాటున ఆ రెండ‌డుగుల వెడ‌ల్పు ఉన్న గొయ్యిలో ప‌డి, ఇరుక్కుపోయింది. ఏ మాత్రం క‌ద‌ల్లేని స్థితికి చేరుకుని మ‌ర‌ణించింది.

బుధ‌వారం తెల్ల‌వారు జామున ఆ గోవును చూసిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీనితో వారు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, ప్రొక్లెయిన‌ర్ ద్వారా గోవు మృత‌దేహాన్ని బ‌య‌టికి తీశారు. కేబుల్ కోసం గుంత‌ను త‌వ్వి దాన్ని అలాగే నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ప్రైవేటు సంస్థ‌పై స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here