బిగ్ బాస్ కంటెస్టెంట్ ను జుట్టుపట్టుకొని లాగిన అభిమానులు.. మహేష్ బాబుపై కామెంట్లు చేసింది ఆమెనే..!

ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ టీవీ షో రసవత్తరంగా సాగుతోంది. గ్రాండ్ ఫినాలేకు సమయం కూడా దగ్గర పడుతోంది. అందులో భాగంగా అభిమానులతో మాట్లాడడానికి నలుగురు కంటెస్టెంట్లు అయిన శిల్ప, హీనా, లవ్, వికాస్ లు వాశిలో ఉన్న ఇనార్బిట్ మాల్ కు వచ్చారు. అయితే ఇక్కడ ఫ్యాన్స్ విపరీతంగా వారిని చుట్టుముట్టారు. అందులో హీనా ఖాన్ ను ఒకరు జుట్టు పట్టుకొని లాగేశారు. దీంతో ఆమె గట్టిగా అరిచేసింది. బిగ్ బాస్ సీజన్ 11 గ్రాండ్ ఫినాలేకు ముందు ఇది చోటుచేసుకోవడంతో హీనా ఖాన్ కు ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దక్షిణాది సినిమాలపై హీనా ఖాన్ గతంలో ఎక్కువగా కామెంట్లు చేసింది. మహేష్ బాబు సినిమా అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో తనని నటించమని అడిగారని.. అయితే తనకు ఎక్స్ పోజింగ్ ఇష్టం లేకనే ఆ సినిమా వద్దనుకున్నానని చెప్పుకొచ్చింది. అలాగే దక్షిణాది హీరోలపై పలు కామెంట్లు కూడా చేసింది. ఎప్పటికప్పుడు మాట మారుస్తూ ఉంటుందని హీనా ఖాన్ ను అంటూ ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here