కారుతో స‌హా ఖ‌న‌నం చేశారు..దాని వెనుక ఓ చిన్న క‌థ!

పుట్టిన‌ప్పుడు మ‌న‌తో పాటు ఏదీ రాదు..పోయేట‌ప్పుడూ మ‌న వెంట ఏదీ ఉండ‌దు.. అనేది భ‌గ‌వద్గీత సారాంశం. దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించాడో చైనీయుడు. పుట్టిన‌ప్పుడు ఏదైనా తీసుకుని రావ‌డం త‌మ చేతుల్లో లేదు గానీ..ఆ ఛాన్స్ కాస్తో, కూస్తో ఉంద‌నుకుంటే అది పోయేట‌ప్పుడే అనే సూత్రాన్ని గ‌ట్టిగా న‌మ్మిన‌ట్టున్నాడు.

అందుకే- మ‌ర‌ణించిన త‌రువాత త‌న భౌతిక కాయాన్ని తాను వాడే కారులో ఉంచి ఖ‌న‌నం చేయాల‌ని వార‌సుల‌కు సూచించాడు. తండ్రి మాట‌ను జ‌వ‌దాట‌లేదా వారసులు. తండ్రి భౌతిక కాయాన్ని ఖ‌రీదైన కారులో ఉంచి, ఖ‌న‌నం చేసేశారు. ఈ ఘ‌ట‌న చైనా ద‌క్షిణ ప్రాంతంలోని హెబెయి ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఓ గ్రామానికి చెందిన క్వై అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం హుండాయ్‌ సోనాటా కారును ఎంతో ఇష్టపడి కొనుకున్నాడు.

అప్పటి నుంచి దాన్ని అపురూపంగా చూసుకుంటున్నాడు. ఇటీవ‌లే క్వై అనారోగ్యానికి గురై మ‌ర‌ణించాడు. దీంతో అతని కుటుంబీకులు, బంధువులు క్వై మృత‌దేహాన్ని శవపేటికలో కాకుండా కారుతోపాటే ఖననం చేశారు. ఇందుకోసం ఓ క్రేన్‌ను తెప్పించి, కారుతో సహా ఖననం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here