దీదీని చంపడానికి కుట్ర జరుగుతోందట.. అది కూడా ఒక పార్టీ ప్లాన్..!

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తొలుత తనను వ్యక్తిగతంగా దెబ్బతీసి…తరవాత భౌతికంగా అడ్డు తొలగించుకోవడానికి ఓ రాజకీయ పార్టీ కుట్ర చేసిందని ఆమె అన్నారు. అయితే ఇంతకుమించిన వివరాలు ఆమె వెల్లడించలేదు. గత కొద్ది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ మీద దీదీ విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే.. అంతేకాకుండా ఆమె కేసీఆర్ ను కలిసి సరికొత్త ఫ్రంట్ ను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమని చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

‘ఓ రాజకీయ పార్టీ నన్ను చంపేందుకు కుట్ర పన్నింది. తొలుత వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం… ఆ తర్వాత భౌతికంగా తొలగించుకోవడం ఆ కుట్ర వ్యూహం’ అని మమతా అన్నారు. తన హత్య విషయంలో ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఖచ్చితమైన సమాచారం వచ్చిందని మమతా బెనర్జీ వివరించారు. ఇప్పటికే ఆ పార్టీ సుపారీ మాట్లాడి అడ్వాన్స్ కూడా ఇచ్చిందని ఆమె కిరాయి హంతకులు తన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారని మమతా వెల్లడించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తననూ తృణమూల్ కాంగ్రెస్ ను ఎవరూ ఏం చేయలేరని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఆ రాజకీయ పార్టీ ఏదయి ఉంటుందా అని అందరూ చర్చించుకుంటూ ఉన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here