బాత్ టబ్ లో స్నానం చేస్తున్నప్పుడు ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ఉపయోగించింది..!

ఎక్కడ చూసినా మొబైల్ ఫోన్ వాడకమే.. అన్నం తింటున్నప్పుడు అదే.. బాత్ రూమ్ కి పోయినప్పుడు అదే ఫోనే చేతుల్లో ఉంటుంది. అలాంటి అలవాటు ఓ అమ్మాయి ప్రాణాలను తీసింది. 12 సంవత్సరాల విద్యార్థిని ఛార్జింగ్ పెట్టిన ఫోన్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంది.

12 సంవత్సరాల సేనియా స్నానం చేయడానికి బాత్ రూమ్ లోకి వెళ్ళింది. తన ఫోన్ ద్వారా పాటలు వింటుండగా దాని ఛార్జింగ్ అయిపోయింది. బాత్ రూమ్ లోనే ఫోన్ ను ఛార్జింగ్ పెట్టి వాడటం మొదలుపెట్టింది. ఇంతలో ఆమె స్నానం చేస్తున్న టబ్ లోకి ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పడింది. అంతే కరెంట్ షాక్ తో ఆ అమ్మాయి మరణించింది.

ఆమె తల్లి మాట్లాడుతూ తన కూతురు బాస్కెట్ బాల్ ఆడేసి వచ్చి స్నానం చేయడానికి వెళ్లిందని చెప్పింది. తాను వంట చేస్తూ ఉండగా తన కూతురు ఎటువంటి చప్పుడు చేయకుంటే ఆమె గది దగ్గరకు వెళ్ళానని అప్పటికే బాత్ టబ్ లో ఆమె చనిపోయి ఉందని.. మొబైల్ ఫోన్ నీటిలో ఉందని చెప్పింది. సేనియా ఒక్కగానొక్క కూతురు. ఆమె తల్లి ఓ కంపెనీ మేనేజర్ వద్ద పి.ఏ.గా పనిచేస్తుండగా.. ఆమె తండ్రి ఓ డ్రైవర్. సేనియాకు ఆటలన్నా, డ్యాన్స్, స్కీయింగ్ అన్నా చాలా ఇష్టమని ఆమె స్నేహితులు, టీచర్లు తెలిపారు. మాస్కో రీజన్ లోని బోల్షూ గ్రిజిలోవో అనే గ్రామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here